Current Affairs Telugu Daily

నగరవాసుల ఆరోగ్యంపై జాతీయ పోషకాహార సంస్థ నివేదిక
దేశంలో ప్రతినలుగురిలో ఒకరు మధుమేహం, ముగ్గరిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై విస్తృత అధ్యయనం నిర్వహించింది. 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.12 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనం ఆహారం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటన్నది స్పష్టం చేస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లోని ప్రజలు ఒక రోజులో తీసుకుంటున్న ఆహారం ఆధారంగా ఆ సంస్థ ఓ నివేదిక రూపొందించింది. 
నివేదికలోని అంశాలు
- భారత వైద్య పరిశోధన సమాఖ్య నిర్దేశించిన మోతాదులోనే నగర ప్రజలు తృణధాన్యాలు (రోజుకు 820 గ్రాములు) చిరుధాన్యాలు (42 గ్రా) తీసుకుంటున్నారు. 
- పాలు, పాల సంబంధిత ఉత్పత్తలు, చక్కెర, బెల్లం వంటి వాటిని మాత్రం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా తీసుకుంటున్నారు. 
- 3 సం॥ల లోపు పిల్లల్లో సగం మందికి, 4-6 ఏళ్ల మధ్య వయసు వారిలో మూడింట రెండొంతుల మందికి. గర్భిణుల్లో 58 శాతం మందికి మాత్రమే రోజూ అవసరానికి తగ్గ మోతాదుల్లో ప్రొటీన్లు, కేలరీలు అందుతున్నాయి.
- 5 సం॥ల లోపు పిల్లల్లో 25 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు. అలాగే 29 శాతం పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి తక్కువగా ఉంటోంది.
- పోషకాహార లేమి అనేది బాలికలతో పోలిస్తే బాలురలోనే (8-11 మధ్య వయసు) ఎక్కువగా ఉంది
- బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లి స్తన్యం పట్టాలన్న సూత్రాన్ని నగర ప్రాంతాల్లో పాటిస్తున్నవారు 42 శాతం మంది మాత్రమే. నలుగురిలో ఒకరు తల్లి పాల కంటే ముందుగా తేనె, గూకోజ్‌, చక్కెర నీరు, మేకపాలు వంటివి పడుతున్నారు.
- నగరాల్లో నివసిస్తున్న పురుషుల్లో 81 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, మహిళల్లో ఈ సంఖ్య 28 శాతంగా ఉంది. అధిక రక్తపోటు సమస్య కేరళలో అత్యధికంగా ఉంటే, అత్యల్బం బిహార్‌ రాష్ట్రంలో నమోదైంది.
- నగరాల్లోని పరుషుల్లో 22 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే మహిళల్లో 19 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

views: 1005

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams