Current Affairs Telugu Daily

ముల్కనూర్‌ డెయిరీకి జాతీయ పురస్కారం 
పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముల్కనూర్‌ మహిళా స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ డెయిరీ అవార్డు ప్రకటించారు. రోజుకు లక్ష లీటర్లలోపు పాల సేకరిస్తున్న డెయిరీలో పాల వ్యాపారం, నాణ్యత, పారదర్శకత, పచ్చదనం అంశాల్లో మొదటి స్థానం సాధించిన వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్‌ మహిళా డెయిరీకి జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌ 26న గుజరాత్‌లోని ఆనంద్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌భాయి రుపాని చేతు మీదుగా డెయిరీ అధ్యక్షురాలు గుర్రాల విజయ, జీఎం మార్పాటీ భాస్కర్‌రెడ్డిలు పురస్కారం అందుకున్నారు. 
views: 1026



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams