Current Affairs Telugu Daily

భారీ వజ్రం లీసాదీ లా రోనాకు రూ.350 కోట్లు 
ప్రపంచలోనే అతిపెద్ద ముడి వజ్రం వేలంలో రూ.346.79 కోట్లు (53 మిలియన్ల డాలర్లు) పలికింది. టెన్నిస్‌ బంతి పరిమాణంలోని ఈ సానపెట్టని వజ్రం బోట్స్‌వానాలోని కరోవ్‌ గనుల్లో రెండేళ్ల క్రితం బయటపడింది. దీన్ని కెనడాకు చెందిన లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ (ఎల్‌డీసీ) వెలికితీసింది. 1,109 క్యారెట్ల ఈ భారీ వజ్రాన్ని వేలంలో బ్రిటన్‌కు చెందిన దిగ్గజ వజ్రాల వ్యాపార సంస్థ ‘గ్రాఫ్‌ డైమండ్స్‌’ దక్కించుకున్నట్లు ఎల్‌డీసీ 2017 సెప్టెంబర్‌ 25న తెలిపింది. క్యారెట్‌కు 31.26 లక్షలు (47,777) చొప్పున చెల్లించినట్లు పేర్కొంది. ‘లీసాదీ లా రోనా’గా పిలుస్తున్న ఈ వజ్రాన్ని 2016లో వేలం సంస్థ ‘సోథ్‌బే’ అమ్మకానికి పెట్టింది. అయితే అనుకున్న ధర పలకకపోవడంతో ఆనాడు దీన్ని అమ్మలేదు.
views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams