Current Affairs Telugu Daily

భారతీయ న్యాయవాదికి స్వీడిష్‌ అవార్డు 
భారతీయ సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గొన్సాల్వ్స్‌ (65)ప్రాథమిక హక్కుల పరిరక్షణలో విశేష కృషికి గాను స్వీడిష్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్న ఆయన గత మూడు దశాబ్దాలుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వినూత్న రీతిలో ఆయుధంగా మలచుకుని భారత్‌లోని అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారని కమిటీ పేర్కొంది. నోబుల్‌ అవార్డుతో సమానంగా భావించే ‘రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డ్స్‌’ పురస్కారం కింద రూ.కోటి 95 లక్షలను అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని 65 ఏళ్ల కొలిన్‌ గొన్సాల్వ్స్‌ అజర్‌బైజాన్‌కు చెందిన ఖాదిజా ఇస్మయిలోవా, అమెరికాకు చెందిన రాబర్ట్‌ బిలోట్‌లతో కలిసి పంచుకోనున్నారు. వారిద్దరిని కూడా హక్కు అవార్డుకు కమిటీ ఎంపిక చేసింది. స్వీడన్‌ విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ 2017 సెప్టెంబర్‌ 26న ఈ అవార్డులను ప్రకటించింది. 51 దేశాల నుంచి వచ్చిన 102 పేర్లను పరిశీలించి ఈ ఏడాది అవార్డుకు గాను వీరు ముగ్గురినీ కమిటీ ఎంపిక చేసింది. రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డ్‌ను 1980 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఇప్పటి వరకూ 69 దేశాలకు చెందిన 170 మంది ఈ పురస్కారాన్ని పొందారు.
views: 985

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams