అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద ప్రయాణ నిషేధ జాబితాను విస్తరించారు. తాజాగా ఉత్తర కొరియా సహా 8 దేశాల పౌరుల అమెరికా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2017 మొదట్లో ముస్లింలు మెజార్టీగా ఉన్న 6 దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలను జారీ చేశారు. దాని గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలను జారీ చేశారు. ఇవి అక్టోబర్ 18 నుంచి అమల్లోకి వస్తాయి. పాత జాబితాలో ఉన్న సోమాలియా, యెమన్, సిరియా, లిబియా, ఇరాన్లకు చెందిన ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగించారు. కొత్తగా ఉత్తర కొరియా, చాద్, వెనెజువెలాలను జోడించారు. సుడాన్ను జాబితా నుంచి తొలగించారు. ఇరాక్ పౌరులపై అదనపు పరిశీన ఉంటుంది. ప్రయాణ నిషేధం మాత్రం ఉండదు.
- అమెరికాలోకి ప్రయాణ ఆంక్షలను విధిస్తూ ట్రంప్ సర్కారు జారీ చేసిన మూడో ఉత్తర్వు ఇది.
- 2017 జనవరిలో ఇచ్చిన మొదటి ఉత్తర్వులో శరణార్థులతో పాటు ముస్లిం ఆధిక్యమున్న 7 దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న మతస్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ ఫెడరల్ కోర్టు దీన్ని అడ్డుకున్నాయి.
- దీంతో 2017 మార్చిలో రెండో ఉత్తర్వును జారీ చేశారు. ఇందులో 6 దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు.
- సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వు నేపథ్యంలో పరిమిత స్థాయిలో ప్రయాణ నిషేధం అమలవుతోంది.
views: 1049