Current Affairs Telugu Daily

ఉపాధి హామీ పథకంపై కామన్‌ రివ్యూ మిషన్‌ నివేదిక 
ఉపాధి హామీ పథకం కింద భారీ ఎత్తున పనులు చేపడుతున్నప్పటికీ వాటిలో అధికభాగం నాణ్యత లేకుండా నాసిరకంగా ఉంటున్నాయి. పర్యవేక్షణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన ‘కామన్‌ రివ్యూ మిషన్‌’ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని పనులను పరిశీలించింది. పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలంటే ప్రస్తుత విధానాల్లో మార్పులు అనివార్యమని తేల్చింది. కుటుంబానికి ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించిన తర్వాత కూడా పార్ట్‌టైమ్‌ (అరపూట పని వంటివి) పనులు కల్పించవచ్చని, ఒకే తరహా పనికి అన్ని రాష్ట్రాల్లోను ఒకేలా కూలి ఉండాలని సిఫార్సు చేసింది. ఉపాధి హామీ పథకం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మారింది. దీని కోసం కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఏకంగా రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతోంది. తెలంగాణలో ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఖర్చు కాగా మార్చి నెలాఖరు లోగా మరో రూ.1000 కోట్ల విలువైన పనులు చేయించాలని సర్కారు భావిస్తోంది. వస్తు సామగ్రి వ్యయంలోని 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రం భరిస్తుండగా మిగతా నిధులన్నీ కేంద్రం నుంచే వస్తుంటాయి. ఏటా రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తుండటంతో పథకం అమలు తీరును పరిశీలించి తగిన సూచనలు చేసేందుకు కేంద్రం కామన్‌ రివ్యూ మిషన్‌ను ఏర్పాటు చేసింది.
రివ్యూ మిషన్‌ నివేదిక అంశాలు
-ఉపాధి హామీ పథకం అమలులో నిబంధనలను అతిక్రమించే సిబ్బందికి విధించే జరిమానా గరిష్టంగా వెయ్యి రూపాయలు మాత్రమే. 11 సం॥లుగా ఇదే కొనసాగుతోంది. దీన్ని పెంచాలి.
-సామాజిక తనిఖీలు, అంబుడ్స్‌మన్‌ వ్యవస్థు పటిష్టంగా ఉండాలి.
-ఉపాధి పనుల నిర్వహణ, పర్యవేక్షణ గ్రామ పంచాయతీ స్థాయిలో ఆశాజనకంగా లేదు. ఇక్కడ మార్పు చేయాలి.
-ఉపాధి పనుల కూలీ డిమాండ్‌ను బట్టి ఉండాలే తప్ప సరఫరాకు అనుగుణంగా ఉండకూడదు.
-చాలా ప్రాంతాల్లో వేతనా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.
-దస్త్రా నిర్వహణ బాగోలేదు. పంచాయతీరాజ్‌ సంస్థల్లో ఖాళీ కారణంగా పర్యవేక్షణ లోపిస్తోంది.
-ఫిర్యాదు పరిష్కారల యంత్రాంగం సక్రమంగా లేదు.
- పనికి దీటుగా వేతనాలు ఉండటం లేదు. పనుల కొతల్లో అక్రమాలకు కనిపిస్తున్నాయి.
- ఉపాధి పనులకు జియో ట్యాగింగ్‌ను 3 దశల్లో చేపట్టి, ముఖ్యమైన పనులు జియో ట్యాగింగ్‌ను కేంద్రానికి చెందిన మిగతా పథకాలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆలా చేస్తేనే ఇతర పథకాల కింద మళ్లీ ఆ పనులకు నిధులు మంజూరు కాకుండా జాగ్రత్తపడొచ్చని అభిప్రాయపడింది.

views: 1148

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams