Current Affairs Telugu Daily

ఎస్‌బీఐ సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వ పరిమితి రూ. 3000 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వ పరిమితిని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కనీస నిల్వ లేకపోతే విధించే అపరాధ రుసుములను సైతం తగ్గించింది. అక్టోబరు నుంచి సవరించిన కనీస నెలవారీ నిల్వ(ఎమ్‌ఏబీ) అమల్లోకి వస్తుంది. పింఛనర్లు, మైనర్ల ఖాతాలతో పాటు ప్రభుత్వం నుంచి సంక్షేమ ప్రయోజనాలను పొందుతున్న ఖాతాదార్లకు ఈ కనీస నిల్వ నిబంధన వర్తించదు. దాదాపు అయిదేళ్ల తర్వాత ఎమ్‌ఏబీని, కనీస నిల్వ లేకుంటే విధించే ఛార్జీలను 2017 ఏప్రిల్‌లో బ్యాంకు తిరిగి ప్రవేశపెట్టింది. మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో కనీస నిల్వ పరిమితి రూ.5000గా ఉండగా.. పట్టణ, పాక్షిక పట్టణ, గ్రామీణ శాఖల్లో వరుసగా రూ.3000, రూ.2,000, రూ.1000గా అప్పట్లో నిర్ణయించింది. అయితే తాజాగా ‘మెట్రో, పట్టణ శాఖను సమానంగా పరిగణిస్తూ మెట్రో నగరాల్లో ఎమ్‌ఏబీని రూ.3000కు తగ్గిస్తున్నామ’ని బ్యాంక్‌ తెలిపింది.
- ఎమ్‌ఏబీని నిర్వహించకపోతే విధించే అపరాధ రుసుములను 20-50 శాతం వరకు తగ్గిస్తూ బ్యాంకు నిర్ణయించింది. 
- ఇకపై ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే పాక్షిక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20-40, పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ.30-50 చొప్పున అపరాధ రుసుమును కట్టాల్సి ఉంటుంది. 
- అంతక్రితం మెట్రోల్లో రూ.100తో పాటు జీఎస్‌టీ కట్టాల్సి ఉండేది.(రూ.5000 ఎమ్‌ఏబీలో 75 శాతం కంటే తక్కువకు పడిపోతే) ఒక వేళ 50 శాతం లేదా అంతకంటే తక్కువకు పడితే రూ.50తో పాటు జీఎస్‌టీ కట్టాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కనీస నిల్వను పాటించకపోతే రూ.20-50(జీఎస్‌టీ అదనం) ఉండేది.
- ప్రాథమిక సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాలు ఈ కనీస నిల్వను పాటించాల్సిన అవసరం లేదు. 

views: 1027



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams