Current Affairs Telugu Daily

భారత్‌లో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ ఆంబానీ
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ నిలిచాడు. ప్రస్తుత సంవత్సరానికి హ్యూరన్‌ రూపొందించిన జాబితాలో వరుసగా ఆరో ఏడాది కూడా ముకేశ్‌ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. 2017లో ఆయన సంపద 58% పెరిగి రూ.2.57 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్‌ జన్మించిన యెమెన్‌ దేశ జీడీపీ కంటే ఆయన సంపద విలువ 50 శాతం ఎక్కువ. ప్రపంచ సంపన్ను జాబితాలో కూడా ఆయన తొలిసారి అత్యుత్తమ 15 మందిలో చోటు దక్కించుకున్నారు. జాబితాలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ 8వ స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన 25వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 173% పెరిగి రూ.70,000 కోట్లకు చేరింది. నగరాల విషయానికొస్తే ముంబయిలో అత్యధిక మంది కుబేరులున్నారు. 182 మంది సంపన్నుతో ఈ నగరానికి తొలి స్థానం దక్కింది. ఢిల్లీ (117 మంది), బెంగళూరు (51 మంది) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలి 10 నగరాల్లో చెన్నై, కాన్పూర్‌ తొలిసారి చోటు సంపాదించాయి.
views: 853

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams