Current Affairs Telugu Daily

విమాన ప్రమాదంలో నేతాజీ మృతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం పై 60 ఏళ్ళక్రితం నాటి జపాన్ ప్రభుత్వ నివేదిక శుక్రవారం వెలుగు చూసింది. ఆగస్టు 18 - 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాల్ని ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్ సైట్ Bosefiles.into ఈ వివరాలను బయట పెట్టింది. 1956లో ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించారని తెలిపింది.
views: 1007



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams