Current Affairs Telugu Daily

రైల్వే ప్లాట్‌ఫాంలపై విలవలను బోధించే పుస్తకాల విక్రయం
రైల్వే ప్లాట్‌ఫారాలపై ఉండే బహుళ ప్రయోజనకర దుకాణాలన్నింటిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలు, చరిత్రకు సంబంధించిన పుస్తకా విక్రయాన్ని తప్పనిసరి చేస్తూ రైల్వే బోర్డు నూతన బహుళ ప్రయోజనకర దుకాణాలు(ఎంపీఎస్‌) విధానాన్ని తీసుకొచ్చింది. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుగా అన్ని ఎంపీఎస్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌/స్వైపింగ్‌ యంత్రా తప్పనిసరిగా ఉండాల్సిందేనని కూడా తాజా విధానంలో పేర్కొంది. రూ.100కు పైగా విలువైన కొనుగోళ్లపై వినియోగదారుల నుంచి అదనపు లావాదేవీ రుసుములు వసూలు చేయకూదడని ఆదేశించింది. తాజా విధానం అమలుపై 2017 సెప్టెంబర్‌ 5న అన్ని జోన్‌లకు వివరాలు అందించింది.
views: 996



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams