Current Affairs Telugu Daily

నైజీరియన్‌ సామాజికవేత్తకు యూఎన్‌ నన్సెన్‌ రెఫ్యూజీ అవార్డు
నైజీరియాకు చెందిన సామాజికవేత్త జన్నా ముస్తఫా, యూఎన్‌ హైకమిషన్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌ (UNHCR) నుంచి నన్సెన్‌ రెఫ్యూజీ  అవార్డు-2017కు ఎంపికయ్యారు. బోకోహారం బాధితులను చైతన్యపరచడం, బాలల హక్కుల సంరక్షణ కోసం చేసిన కృషిగాను ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. చిన్నారులను, ముఖ్యంగా బాలికలను మానవ బాంబులుగా ఉపయోగించే నైజీరియా తీవ్రవాద సంస్థ బోకోహారం. ఈ సంస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషిచేసిన జన్నా ముస్తఫా బాధిత ప్రజలకు అండగా నిలబడ్డారు. శరణార్థులు, నిర్వాసితులకు సహాయం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, బృందానికి UNHCR  ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. నార్వేకు చెందిన నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఫ్రిడోఫ్‌ నన్సెన్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని 1954 నుంచి అందజేస్తున్నారు.
UNHCR-United Nations High Commissioner for Refugees

views: 856

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams