Current Affairs Telugu Daily

గూగుల్‌ చేతికి  హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారం
తైవాన్‌కు చెందిన హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌కు విక్రయించనున్నట్లువెల్లడించింది. ఈ డీల్‌ విలువ సుమారు 1.1 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు గూగుల్‌కు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్‌ చేర్చుకుంటుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్‌ పూర్తవుతుంది.
views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams