Current Affairs Telugu Daily

చైనాలో ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రారంభం
ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ను చైనా 2017 సెప్టెంబర్‌ 21న ప్రారంభించింది. ‘ఫ్యుక్సింగ్‌’గా పిలిచే ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. బీజింగ్‌-షాంఘై హై-స్పీడ్‌ రైల్వే లైనులో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గరిష్గ వేగాన్ని అందుకుంటుంది.  దీంతో ఈ  రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 4 గంటల 28 నిమిషాల మేర తగ్గనుంది. రోజూ 5,05,000 మంది ప్రయాణించే ఈ మార్గంలో తాజాగా అందుబాటులోకి తెచ్చిన  ఈ రైలు  ద్వారా  సుమారు గంట ప్రయాణ సమయం ఆదా కానుంది.
- 2008లో బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టిన చైనా 2011లో వాటి వేగాన్ని గణనీయంగా తగ్గించింది.  
- 2011 జులైలో రెండు బుల్లెట్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 40 మంది చనిపోగా, 190 మంది గాయపడ్డారు. అతివేగం కారణంగా ప్రమాదారైలు  జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు  వాటి వేగాన్ని నియంత్రించారు. 
- మళ్లీ ఆరేళ్ల తర్వాత అత్యధిక వేగంతో నడిచే రైలును పునఃప్రారంభించారు. 
- ప్రస్తుతం రైలు గంటకు అత్యధికంగా 400 కి.మీ వేగంతో ప్రయాణించే వీలున్నా, 350 కి.మీకే పరిమితం చేశారు. ఈ వేగంతో ప్రయాణిస్తే 10శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.
- సెక్యూరిటీ రీత్యా ఈ  బుల్లెట్‌ ట్రెయిన్‌ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. 
- ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా విపత్తు ఎదురైతే రైలు దానికదే వేగాన్ని నియంత్రించుకునే ఏర్పాటు కూడా ఉంది.  
- రిమోట్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌తో కూడిన ఈ రైలు లోని అన్ని బోగీల్లో వైఫై, మొబైళ్ల ఛార్జింగ్‌ పోర్టులు అందుబాటులో ఉంటాయి. 

ఆరోగ్యశ్రీ యాప్‌కు డీఎల్‌ షా నేషనల్‌ క్వాలిటీ గోల్డ్‌ అవార్డు-2017
వైద్యరంగంలో నాణ్యమైన సేవందించడంలో భాగంగా ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు రూపొందించి అమలు చేస్తోన్న జీపీఎస్‌ ఆధారిత మొబైల్‌ యాప్‌కు జాతీయ అవార్డు లభించింది. ఉత్పత్తులు, సేలు, నిర్వహణ తదితర అంశాల్లో కనబరిచే నాణ్యత ప్రాతిపదికన క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రదానం చేసే డీఎల్‌ షా నేషనల్‌ క్వాలిటీ గోల్డ్‌ అవార్డు-2017కు ఆరోగ్యశ్రీ యాప్‌ ఎంపికైంది. 

views: 951

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams