Current Affairs Telugu Daily

కార్టూనిస్ట్‌ మోహన్‌ మృతి
ప్రముఖ కార్టూనిస్ట్‌ మోహన్‌ 2017 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. మోహన్‌ 1951 డిసెంబరు 24న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆయనకు భార్య కమల, కుమారుడు డా.చేగువేర ఉన్నారు. ఇతని తండ్రి అప్పలనాయుడు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మోహన్‌ కూడా తండ్రి బాటలోనే నడిచారు. విశాలాంధ్రలో పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రభ, ఉదయం, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, సాక్షి తదితర దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. సామాజిక, రాజకీయ అంశాలపై అనేక కార్టూన్లు వేశారు. కార్టూన్‌ కబుర్లు పేరుతో ఒక పుస్తకాన్ని మెవరించారు. మేజిక్‌ లాంప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక యానిమేషన్‌ స్టూడియోను నిర్వహిస్తున్నారు. 
views: 779

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams