Current Affairs Telugu Daily

సహకార ఉద్యమ నాయకుడు లక్ష్మణ్‌ మాధవ్‌ రావు ఇనాందార్‌ శత జయంతి
మహారాష్ట్రకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, సహకార ఉద్యమ నాయకుడు లక్ష్మణ్‌ మాధవ్‌ రావు ఇనాందార్‌ శత జయంతి ని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడి రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపయ్యేలా సహకార రంగం విస్తరించాలని ఆకాంక్షించారు. సహకార సేవలు ఇతర రంగాలకు విస్తరించాలని ప్రధాని మోడి సూచించారు. ప్రస్తుతం డెయిరీ, చక్కెర రంగాలకే ఇది పరిమితమయిందన్నారు. వేపపూత ఉన్న యూరియాకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వేప నూనె తయారీలో మహిళలను ప్రోత్సహించవచ్చని చెప్పారు. ‘తీపి విప్లవా’న్ని తీసుకొచ్చే తేనెటీగల పెంపకాన్నీ సహకార రంగం పరిధిలో చేర్చవచ్చని తెలిపారు. మత్స్యకారులతో సహకార సంఘాలు ఏర్పాటు చేయించాలని, ఎన్నో ఉపయోగాలు ఉన్న సముద్ర నాచు పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇనాందార్‌తో పాటు, మరో 9 మంది సహకార ఉద్యమనేతలపై రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. విజయాల బాటలో నడుస్తున్న 7 సహకార సంఘాలకు జ్ఞాపికలు అందజేశారు.
- లక్ష్మణ్‌ మాధవ్‌ రావు ఇనాందార్‌ 1979లో ముంబయిలో సహకార్‌ భారతి పేరుతో సహకార ఉద్యమాన్ని నిర్వహించారు. 

views: 922



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams