Current Affairs Telugu Daily

గాలి నాణ్యతను గుర్తిస్తే లక్ష డాలర్ల బహుమతి : నాసా
గాలిలో నాణ్యతను కొలిచే సెన్సార్‌ను తయారు చేసిన వారికి లక్ష డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. భూమి మీదైనా, అంతరిక్షంలో అయినా మనిషి బతకడానికి అనుగుణమైన గాలి ఎంతో అవసరం. గాలిలో ఉండే చిన్న ధూళి కణాలను ఎయిరోసోల్స్‌ అంటారు. గాలిలో వీటి శాతాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు. ఇవి ఎంత శాతం ఉన్నాయో తెలిపే సెన్సార్‌ను కనిపెట్టిన వారికే ఈ బహుమతి అందుతుంది. ఈ సెన్సార్‌ను చాలా తక్కువ ఖర్చుతో, వీలైనంత తక్కువ బరువుతో, ఎక్కడైనా ఉపయోగించేలా తయారు చేయాలి. నాసా, రాబర్ట్‌ ఉడ్‌ జాన్సన్‌ ఫౌండేషన్‌(ఆర్‌డబ్లూజేఎఫ్‌) కలసి ఈ బహుమతిని ప్రకటించాయి. 2017 డిసెంబరు 13 లోపు దరఖాస్తు చేసుకొని వచ్చే 2018 జనవరి 31లోపు పరికరాన్ని వారికి సమర్పించాలి.
views: 856



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams