Current Affairs Telugu Daily

డార్జిలింగ్‌ ప్రాంత అభివృద్ధికి పరిపాకుల మండలి ఏర్పాటు
డార్జిలింగ్‌ ప్రాంత అభివృద్ధి కోసం పరిపాకుల మండలి (బోర్డు ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌-బీఓఏ) ఏర్పాటు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 20న నిర్ణయం తీసుకొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఇప్పుడున్న గూర్ఖాలాండ్‌ ప్రాదేశిక పరిపాలన సంస్థ (గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌-జీటీఏ)కు సభ్యులు సామూహికంగా రాజీనామా చేశారు. దాంతో ఐఏఎస్‌ అధికారిని నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జీటీఏకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో 9 మంది సభ్యులున్న మండలిని ఏర్పాటు చేశారు.
- పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి : మమతా బెనర్జీ 

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams