Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియా తూర్పు తీరంలో చిట్టి ఆక్టోపస్‌ నగరం
ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఓ చిట్టి ఆక్టోపస్‌ నగరం వెలుగుచూసింది. సముద్ర ఉపరితలానికి 10 నుంచి 15 మీ. దిగువన ఇది బయటపడిరది. 18 మీ. పొడవు, 4 మీ. వెడల్పున్న  దీనిలో చిట్టి గుహలు, ఇసుక కుప్పల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిలోని 13 గుహల్లో ఆక్టోపస్‌లున్నాయి. చీకటి అలుముకున్న ఇలాంటి ప్రాంతాలు బయటపడటం ఇది రెండోసారని అమెరికాలోని ఇల్లినాయిస్‌ వర్సిటీ నిపుణులు తెలిపారు. జెర్విస్‌ బే తీరంలో 2009లోనూ ఇలాంటి ఆక్టోపస్‌ స్థావరం బయటపడిరది. తాజా స్థావరం దీనికి కొన్ని వందల కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొన్ని ప్రత్యేక శబ్దాలు, సంకేతాలు, వర్ణ భేదాలతో అక్టోపస్‌లు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటున్నట్లు గుర్తించారు. 
views: 900

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams