Current Affairs Telugu Daily

నేపాల్‌ సరిహద్దుకు చైనా రోడ్డు
నేపాల్‌ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి జీ 318ని, టిబెట్‌లోని షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన 40 కి.మీ. ల పొడవైన రోడ్డును చైనా 2017 సెప్టెంబర్‌ 18న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని పౌర అవసరాలతో పాటు మిలిటరీ సేవకు కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ రహదారి ద్వారా దక్షిణాసియా ప్రాంతాల్లోకి చేరుకోవడానికి చైనాకు సులభమవుతుంది. టిబెట్‌ రాజధాని లాస, షిగాసే నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు సమాంతరంగా కొత్త రోడ్డు మార్గం ఉంది. కాగా, జీ 318 రహదారి అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు చాలా దగ్గరి నుంచే వెళ్తుంది.
views: 873

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams