Current Affairs Telugu Daily

NIA డైరెక్టర్‌ జనరల్‌గా వై.సి.మోడి
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐ.పి.ఎస్‌. అధికారి వై.సి.మోడిని నియమించడానికి కేంద్ర కేబినెట్‌ నియామకాల సంఘం 2017 సెప్టెంబర్‌ 18న ఆమోదం తెలిపింది. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో వై.సి.మోడి సభ్యుడిగా ఉన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక వనరులకు ముడిపడిన కేసుల్ని విచారించే NIAకు ప్రస్తుతం శరద్‌కుమార్‌ అధిపతిగా ఉన్నారు. ఆయన పదవీకాలం 2017 అక్టోబరు 30న ముగుస్తుంది. ఆ వెంటనే వై.సి.మోడి ఆ బాధ్యతల్ని చేపడతారు. ఆయన పదవీకాలం 2021 మే 31 వరకు ఉంటుంది. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన అసోం-మేఘాలయా క్యాడర్‌ అధికారి. ప్రస్తుతం సీబీఐలో ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు.
NIA-National Investigation Agency
- NIAను 2009లో ఏర్పాటు చేశారు
- NIA ప్రధాన కార్యాయం : న్యూఢిల్లీ 

views: 924

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams