Current Affairs Telugu Daily

పరిశ్రమలకు విశ్వకర్మ, భద్రతా పురస్కారాలు
పారిశ్రామిక రంగంలో నాణ్యత, ఉత్పాదకత ప్రమాణాలు పాటించడంతోపాటు, కార్మికుల భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకోసం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా కేంద్ర కార్మికశాఖ 2017 సెప్టెంబర్‌ 17న న్యూఢిల్లీలో 2015 సంవత్సరానికి విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్‌, జాతీయ భద్రతా పురస్కారాలు ప్రదానం చేసింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌గంగ్వార్‌ 111 మంది వ్యక్తులకు విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్‌, 126 సంస్థలకు భద్రతా పురస్కారాలు అందించారు. భద్రతా పురస్కారాల్లో 73 సంస్థలు విన్నర్‌, 53 రన్నరప్‌ అవార్డు లుఅందుకున్నాయి.
- హైదరాబాద్‌లోని రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వి.బాబురావు విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి వి.బాబురావు
- జాతీయ భద్రతా పురస్కారం కింద రబ్బర్‌ అండ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ విభాగంలో తెలంగాణలోని పటాన్‌చెరుకు చెందిన జేకే ఫెన్నెర్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఒక రన్నరప్‌, ఒక విన్నర్‌ అవార్డు అందుకుంది. 
- ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎరువులు, రసాయనాల తయారీ విభాగంలో విశాఖ పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రన్నరప్‌, విన్నర్‌ అవార్డులు గెలుచుకుంది. ఇదే విభాగంలో విశాఖపట్నానికి చెందిన ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ విన్నర్‌గా నిలిచింది. 
- ఆహార, పానీయాల విభాగంలో కృష్ణా జిల్లా లక్ష్మీపురం, ఉయ్యూరుల్లో నడుస్తున్న కేసీపీ సుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విన్నర్‌, రన్నరప్‌ల కింద మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన రుచి సోయ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ విన్నర్‌గా అవార్డు స్వీకరించింది.

views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams