Current Affairs Telugu Daily

యూఎన్‌ఓ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు భారత్‌ తరఫున పాల్గొనే అవకాశం 
వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశానికి భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్‌ను పంపించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ 2017 సెప్టెంబర్‌ 17న ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 11.72 శాతం వృద్ధిరేటును సాధించడాన్ని పరిగణనలోకి తీసుకున్న నీతి ఆయోగ్‌ ఈ సమావేశం కోసం ఏపీ పేరును సూచించిందని పేర్కొంది. 
views: 852



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams