Current Affairs Telugu Daily

కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో వెంకట్‌ రాహుల్‌కు రెండు స్వర్ణాలు
కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ రాగా వెంకట్‌ రాహుల్‌ ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించాడు.సెప్టెంబర్‌ 7న జరిగిన సీనియర్‌, జూనియర్‌ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్‌ రెండు విభాగాల్లోనూ స్యాచ్‌లో 156 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు రాహుల్‌ అర్హత సాధించాడు.
views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams