Current Affairs Telugu Daily

2020 నాటికి తట్టు రహిత దేశంగా భారత్‌
భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని మరో నాలుగు దేశాలను(బంగ్లాదేశ్‌, మయన్మార్‌, తైమూర్‌, ఇండోనేషియా)2020 నాటికి తట్టు(మీసెల్స్‌) రహిత ప్రాంతాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యంగా నిర్దేశించుకుంది.ఇందుకోసం 800 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అలాగే, 2018 నాటికి ఈ దేశాల్లోని 400 మిలియన్ల చిన్నారులకు తట్టు నిరోధక టికాను సరఫరా చేయనుంది. డబ్ల్యూహెచ్‌.వో గణాంకాల ప్రకారం వైరస్‌ కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా 1,34200 మంది చిన్నారులు మరణిస్తున్నారు.
views: 1060

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams