Current Affairs Telugu Daily

‘‘బెస్ట్‌ లిష్టర్‌’’ రాగల వెంకట రాహుల్‌
కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులుకొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌ లిఫ్టర్‌ రాగాల  వెంకట రాహుల్‌ తాజాగా రెండు అవార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్‌ పురుషులు , జూనియర్‌ పురుషులు 85 కేజీల విభాగాల్లో ‘‘బెస్ట్‌ లిఫ్టర్‌’’ అవార్డును రాహుల్‌ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా. అందులో రెండు ఏపీ లిఫ్టర్‌కే దక్కాయి. మీరాబాయి చానుకు సీనియర్‌ మహిళ కేటగిరీలో దీపక్‌ యూత్‌ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి.మొత్తంగా ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. సెప్టెంబర్‌ 9న చివరి రోజు పోటీల్లో పర్డిప్‌ సింగ్‌ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు.
views: 822

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams