Current Affairs Telugu Daily

హిందీ దివస్‌(సెప్టెంబర్‌ 14)
దేశవ్యాప్తంగా 2017 సెప్టెంబర్‌ 14న హిందీ దివస్‌ను నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 14ను హిందీ దివస్‌గా నిర్వహిస్తుంటారు. 
హిందీ దివస్‌ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ మాట్లాడుతూ ప్రాంతీయ భాషకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. అప్పుడే దేశవ్యాప్తంగా హిందీ ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. తమిళులును పలకరించేటప్పుడు ‘వణక్కం’, సిక్కులతో మాట్లాడేటప్పుడు ‘సత్‌ శ్రీ ఆకాల్‌’, ముస్లింలతో ‘ఆదాబ్‌’ అని సంభాషించాలని, తెలుగువారిని ‘గారు’ అని గౌరవించాల’ని కోరారు. ఇతర భాషల్లో మాట్లాడడం వల్ల ప్రజల మధ్య ఐకమత్యం పెరుగుతుందని అన్నారు. ఇటీవల బెలారస్‌ అధ్యక్షుడు గౌరవార్థం ఇచ్చిన విందులో తాను రష్యా భాషలో ‘స్పాసిబా’ (కృతజ్ఞతలు) అంటూ మాట్లాడానని అన్నారు. ఇందుకు సంతోషించిన బెలారస్‌ అధ్యక్షుడు ‘జై హింద్‌’ అంటూ స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో హిందీ నేర్చుకొనే వారే సౌలభ్యం కోసం లీలా మొబైల్‌ యాప్‌ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. హిందీ భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పలువురికి రాష్ట్రపతి రాజ్యభాష పురస్కారాలు అందజేశారు. 
రాజ్యభాష పురస్కార గ్రహీతలు
వి.ఉదయ భాస్కర్‌ (బీడీఎల్‌-హైదరాబాద్‌)
ఓంనిధి శర్మ (బీడీఎల్‌-హైదరాబాద్‌)
హరదయాళ్‌ ప్రసాద్‌ (ఎస్‌బీఐ-హైదరాబాద్‌)
విష్ణుభగవాన్‌ శర్మ (ఎస్‌బీఐ- హైదరాబాద్‌)
సుగుణ (విశాఖ ఉక్కు కర్మాగారం) 
- హిందీ దివస్‌ను 1949 నుంచి నిర్వహిస్తున్నారు. 1949 సెప్టెంబర్‌ 14న హిందీని జాతీయ అధికార భాషగా ప్రకటించారు. 

views: 936

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams