Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారిగా విష్ణుదేవ్‌ 
తెలంగాణ రాష్ట్ర జాతీయ సేవాపథకం(NSS) అధికారిగా డాక్టర్‌ పులుచెరు విష్ణుదేవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య ఆధ్వర్యంలోని కమిటీ ఆయనను కీలకమైన పదవికి ఎంపిక చేసింది. ప్రస్తుతం విష్ణుదేవ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. విష్ణుదేవ్‌ స్వస్థలం వరంగల్‌ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం. 
NSS-National Service Scheme

views: 1133



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams