ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖకు స్కోచ్ పురస్కారం
ఈ-పాలనను మెరుగ్గా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మక స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్, స్కోచ్ ఆర్డర్ ఫర్ మెరిట్ అవార్డు-2017కు ఎంపికైంది. ప్రతి ఏడాది స్కోచ్ సంస్థ ఆర్థికం, సాంకేతిక, పాలన, విద్య, ఇతర రంగాల్లో ఉత్తమ విధానాలను అవలంబించే శాఖలకు ఈ పురస్కారాలను ఇస్తోంది. ఈ ఏడాది పాఠశాలల్లో స్కూల్ ఇనార్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎస్ఐఎంఎస్) ప్రాజెక్టుకు దేశంలో ఉత్తమంగా నిర్వహించి రాష్ట్ర విద్యా శాఖ ఈ పురస్కారానికి ఎంపికైంది.
views: 1157