Current Affairs Telugu Daily

ABC ఛైర్మన్‌గా దేవవ్రత ముఖర్జీ 
2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ABC) ఛైర్మన్‌గా దేవవ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోకాకోలా నైరుతి ఆసియా ప్రాంత కార్యకలాపాల విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ముఖర్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏబీసీకి డిప్యూటీ ఛైర్మన్‌గా హోమ్సుజీ ఎన్‌ కామా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా హర్మజుద్‌ మసాని ఉండనున్నారు.
2017-18 సంవత్సరానికి ఏబీసీ కౌన్సిల్‌ సభ్యులు
అడ్వర్టయిజర్ల ప్రతినిధులు
1. దేవవ్రత ముఖర్జీ (కోకాకోలా ఇండియా)
2. హేమంత్‌ మాలిక్‌ (ఐటీసీ)
3. సందీప్‌ తర్కాస్‌ (ప్యూచర్‌ రిటైల్‌)
4. మయాంక్‌ పారీఖ్‌ (టాటా మోటార్స్‌)
పబ్లిషర్ల ప్రతినిధులు..
1. హోమ్సుజీ ఎన్‌ కామా (ద బోంబే సమాచార్‌)
2. ఐ.వెంకట్‌ (ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌)
3. శైలేష్‌ గుప్తా (జాగరణ్‌ ప్రకాశన్‌)
4. దేవేంద్రా వి దార్దా (లోక్‌మాత్‌ మీడియా)
5. బెనోయ్‌ రాయ్‌ చౌదురీ (హెచ్‌టీ మీడియా)
6. చందన్‌ మజుందార్‌ (ఏబీపీ)
7. రాజ్‌ కుమార్‌ జైన్‌ (బెన్నెట్‌, కోల్మాన్‌ అండ్‌ కంపెనీ)
8. ప్రతాప్‌ జి పవార్‌ (సకల్‌ పేపర్స్‌)
అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు..
1. మధుకర్‌ కామత్‌ (డీడీబీ ముద్రా)
2. శశిదర్‌ సిన్హా (ఐపీజీ మీడియా బ్రాండ్స్‌)
3. శ్రీనివాసన్‌ కె స్వామి (ఆర్‌కే స్వామి బీబీడీఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌)
4. సీవీఎల్‌ శ్రీనివాస్‌ (గ్రూప్‌ ఎం మీడియా ఇండియా).
ABC-Audit Bureau of Circulations 

views: 913Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams