Current Affairs Telugu Daily

అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన 
అహ్మదాబాద్‌-ముంబయి రైల్వే స్టేషన్‌ మధ్య రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలును తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన పథకానికి ప్రధాని నరేంద్రమోడి, జపాన్‌ ప్రధాని షింజో అబే 2017 సెప్టెంబర్‌ 14న అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేశారు. 
బుల్లెట్‌ రైలు పథకం కోసం జపాన్‌ దాదాపు రూ.88,000 కోట్ల రుణాన్ని కేవలం ఒక్క పైసా వడ్డీకి ఇస్తోంది. బుల్లెట్‌ రైలు పథకం కోసం 4 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వడోదరాలో ఏర్పాటు కానున్న శిక్షణ సంస్థకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. బుల్లెట్‌ రైలు మార్గం 2022 నాటికి పూర్తవుతుంది. ఈశాన్య భారతంలో అనుసంధానతను మెరుగుపరిచే పనులకు జపాన్‌ 38.66 బిలియన్‌ యెన్‌ (సుమారు రూ.2242 కోట్లు) రుణాన్ని సమకూర్చనుంది. గుజరాత్‌, బెంగాల్‌లోని వివిధ అభివృద్ధి పనులు సహా మొత్తం మీద రూ.6000 కోట్ల రుణాన్ని జపాన్‌ ఇస్తుంది.

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams