Current Affairs Telugu Daily

విద్యార్థు భద్రతపై CBSE  నూతన మార్గదర్శకాలు 
పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతవరకు విద్యార్థుల రక్షణ బాధ్యత పాఠశాలదేనని కేంద్ర మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది. శారీరక-మానసిక వేధింపులు లేని సురక్షిత వాతావరణంలో విద్యనభ్యసించడం పిల్లల ప్రాథమిక హక్కుగా వ్యాఖ్యానించింది. విద్యార్థుల భద్రతపై అలసత్వం ప్రదర్శిస్తే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. భోదన, భోదనేతర సిబ్బందికి మానసిక విశ్లేషణ పరీక్షలు జరిపించాలని ఆదేశించింది. గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో ఏడేళ్ల విద్యార్థి హత్య, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై పాఠశాలలో అత్యాచారం వంటి దారుణ ఘటనల నేపథ్యంలో విద్యార్థుల రక్షణపై ప్రస్తుతం తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌ 14న సీబీఎస్‌ఈ విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాలలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు..
- పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. భద్రతా తనిఖీలు, పోలీసు తనిఖీలు నిర్వహించాలి. బోధన సిబ్బందితోపాటు బస్సు డ్రైవర్లు, ఇతర బోధనేతర సిబ్బందికి మానసిక విశ్లేషణ పరీక్షలు జరిపించాలి. వీటిపై సీబీఎస్‌ఈకి రెండు నెలల్లోగా ఆన్‌లైన్‌లో నివేదిక ఇవ్వాలి.
- పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాలను నియంత్రించాలి. సందర్శకులను నిరంతరం పర్యవేక్షించాలి.
- వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా పాఠశాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. వారి బాధ్యతలను తెలియజేయాలి.
- గుర్తింపు పొందిన సంస్థల నుంచే సహాయ సిబ్బందిని నియమించుకోవాలి.
- విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి గాను వేర్వేరు కమిటీలను ఏర్పాటుచేయాలి. లైంగిక వేధింపులపై అంతర్గత ఫిర్యాదు కమిటీతో పాటు లైంగిక దాడుల నుంచి చిన్నారుల సంరక్షణ చట్టం (పోక్సో)-2012 కింద కమిటీలు ఉండాలి. వాటి వివరాలు, సభ్యులను ఎలా సంప్రదించాలి? వంటి అంశాలను నోటీసు బోర్డులో, పాఠశా ల వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రదర్శించాలి.
CBSE-Central Board of Secondary Education
CBSE Chairperson - ANITA KARWAL

views: 888

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams