Current Affairs Telugu Daily

మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ : అమెరికా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు షాక్‌ ఇచ్చారు. ఇండియాను అక్రమంగా మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల వరుసలో చేర్చారు. మొత్తం 21 దేశాలు మత్తు పదార్థాల ఉత్పత్తి చేసేవిగా, రవాణా చేసేవిగా ప్రకటించారు. ఈ దేశాల్లో పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లు ఎక్కువగా డ్రగ్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ దేశాలుగా పేర్కొన్నారు. భారత్‌తో పోలిస్తే మిగతా దేశాలు అత్యధికంగా డ్రగ్స్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. బహమాస్‌, బెలిజ్‌, బొలివియా, కొలంబియా, కాస్తారికా, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వేడార్‌ ఈఐ సాల్వడార్‌, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్‌, జమైకా, లావోస్‌, మెక్సికో, నైకాగువా, పనామా, పెరూ, వెనెజులా వంటి దేశాల సరసన భారత్‌ను కూడా ప్రకటించారు. భౌగోళిక స్వరూపం, వాణిజ్య వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావాలువంటివి ఈ దేశాల్లో డ్రగ్స్‌ ఉత్పత్తికైనా, రవాణా చేయడానికైనా అనుకూలంగా ఉన్నాయని, ఆ కారణంగానే ఈ దేశాలను ఆ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. 
views: 877



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams