2024, 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే నగరాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 2017 సెప్టెంబర్ 13న అధికారికంగా ప్రకటించింది. 2024 ఒలింపిక్స్‌కు పారిస్ ఆతిథ్యమివ్వనుండగా, 2028 ఒలింపిక్స్‌ను లాస్ ఏంజెలెస్ నిర్వహించనుంది. ఒకేసారి రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్య నగరాలను ప్రకటించడం IOC చరితల్రో ఇదే ప్రథమం.
- ఈ రెండు నగరాలకు ఇంతకుముందు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన అనుభవముంది.
- పారిస్ 1900, 1924లో ఒలింపిక్స్ నిర్వహించింది. పారిస్ నగరం చివరిసారిగా 1924లో ఒలింపిక్స్ నిర్వహించింది. మళ్లీ 100 సం॥ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
- లాస్ ఏంజెలెస్ 1932, 1984లో ఒలింపిక్స్ నిర్వహించింది.
IOC-International Olympic Committee
- IOC అధ్యక్షుడు : థామస్ బాక్
views: 1084