Current Affairs Telugu Daily

భారత్‌లో అత్యుత్తమ బ్రాండ్లలో HDFC బ్యాంక్‌కు ప్రథమ స్థానం
భారత్‌లో అత్యుత్తమ 50 బ్రాండుల్లో HDFC బ్యాంక్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2014 నుంచి సేవలను మెరుగుపర్చుకోవడంపై నిరంతర కృషితో బ్రాండు విలువలను రెట్టింపు చేసుకుంది. ఆ సమయంతో పోలిస్తే ఈ దిగ్గజ బ్యాంకు బ్రాండు విలువ 940 కోట్ల డాలర్ల నుంచి 1800 కోట్ల డాలర్లకు పెరిగిందని పరిశోధన సంస్థ కంటార్‌ మిల్‌వార్డ్‌ బ్రౌన్‌ తెలిపింది. HDFCబ్యాంకు అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది నాలుగో ఏడాది. 2017 సంవత్సరానికి అత్యంత విలువ ఉన్న భారత్‌ కంపెనీల బ్రాండ్లతో ద బ్రాండ్జ్‌ ఇండియా టాప్‌ 50 జాబితాను డబ్లూపీపీ, కంటార్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్‌ ప్రకటించాయి. తొలిసారి ఈ జాబితాలోకి అడుగుపెట్టిన జియో 11వ స్థానంలో నిలిచింది. ఇదే కాకుండా కొత్తగా జాబితాలో చేరిన బ్రాండ్లలో డీమార్డ్‌, వర్ల్‌పూల్‌, బజాజ్‌ అలయెంజ్‌, కెనరా బ్యాంక్‌, సన్‌ డైరెక్ట్‌, డిష్‌ టీవీ ఉన్నాయి. 
HDFC-Housing Development Finance Corporation 

views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams