భారత్‌లో జరిగే NRI పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ సూచించింది. NRI పెళ్లిళ్ల వివాదాలు, ఇతర సంబంధిత అంశాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇది అవసరమని కమిటీ పేర్కొంది. ఎన్ఆర్ఐ భర్తలు వదిలివేస్తున్న మహిళల హక్కుల పరిరక్షణ, గృహహింస, కట్న వేధింపుల బాధితులకు సహాయపడేందుకు ఇది దోహదపడుతుందని కమిటీ వెల్లడించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ 2017 ఆగస్టు 30న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. నిందితుల అప్పగింత కోసం భారత్ పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో కట్నం వేధింపులను కూడా చేర్చాలని కమిటీ కీలక సూచన చేసింది.
NRI-Non-resident Indian
views: 894