Current Affairs Telugu Daily

చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం
1960ల్లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్‌ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్‌కు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించారు. 
- బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్‌లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్‌కు వలస వచ్చారు. అప్పుడు వారు 5 వేల మంది దాకా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది.

views: 985

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams