Current Affairs Telugu Daily

తెలుగు సహా మరో 6 భాషలకు గూగుల్‌  ట్రాన్స్‌లేట్‌ యాప్‌
మరో 7 భారతీయ భాషల్లో ట్రాన్స్‌లేట్‌ యాప్‌ అందుబాటులోకి రానుందని గూగుల్‌ 2017 సెప్టెంబర్‌ 13న ప్రకటించింది. దీని ద్వారా ఆంగ్లంలో ఉన్న రహదారి సూచికలను కూడా అనువదించి చదువుకోవడానికి విలు పడుతుంది. ప్రస్తుతం హిందీ భాషకు ఈ సౌకర్యం ఉండగా, ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని సందర్భాల్లో ఆఫ్‌లైన్‌లోనూ అనువదించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసుకున్న సమయంలోనే సంబంధిత భాషకు చెందిన ప్యాకేజీని డౌన్‌లోడు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేసినా దాన్ని కూడా అనువదిస్తుంది.
views: 935

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams