Current Affairs Telugu Daily

విదేశీ నిధులు పొందకుండా వందల సంస్థలపై కేంద్రం నిషేధం
జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ(ఢిల్లీ), ఐసీఏఆర్‌, ఇగ్నో, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సహా వందల సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందకుండా కేంద్రం నిషేధించింది. ఈ సంస్థలన్నీ వరుసగా 5 సం॥ల పాటు వార్షిక రిటర్నులను సమర్పించడంలో విఫలమైనందున విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA)-2010 కింద అనుమతులను హోంశాఖ రద్దు చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏ పరిధిలోని సంస్థలన్నీ తప్పనిసరిగా ఆదాయ, వ్యయ పద్దులను ఏటా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. లేనట్లయితే వాటి అనుమతులు రద్దయి, విదేశాల నుంచి నిధులు పొందే వీలుండదు.
FCRA-Foreign Contribution (regulation) Act

views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams