డిజిటల్ ప్రకటనల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. విద్వేష భావాల వ్యాప్తికీ అడ్డుకట్ట వేస్తామని తెలిపింది. తమ నెట్వర్క్పై ప్రకటనల ద్వారా సొమ్ము చేసుకోవడాన్ని అడ్డుకునేలా కఠిన నిబంధనల్ని ప్రవేశపెడతామని పేర్కొంది. ఈ అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాల కోసం కొత్త ప్రమాణాల్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. తామిచ్చే డిజిటల్ ప్రకటనలు నిర్దేశిత శ్రోతల్ని చేరడం లేదనీ, కొన్నిసార్లు సంబంధిత బ్రాండ్లకు హాని కలిగించే అంశాలున్న చోట్ల ప్రకటనల్ని ఉంచుతున్నారనీ, సరైన విధంగా అనుశీలన చేయడం లేదనే విమర్శల్ని ఎదుర్కొంటోంది.
views: 850