Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో దావూద్‌ ఇబ్రహీం ఆస్తులు జప్తు 
ప్రపంచ ఉగ్రవాదిగా పేరొంది.. పరారీలో ఉన్న మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం(61)కు వ్యతిరేకంగా బ్రిటన్‌ తీవ్రస్థాయిలో స్పందించింది. బ్రిటన్‌ ప్రభుత్వం తమ దేశంలో దావూద్‌ పేరిట రిజిస్టరైన ఆస్తుల్ని 2017 సెప్టెంబర్‌ 13న జప్తు చేసింది. దావూద్‌ నికర ఆస్తుల విలువ సుమారు 670 కోట్ల డాలర్ల దాకా ఉన్నట్లు అంచనా. జప్తు చేసిన ఆస్తుల్లో వార్విక్‌షైర్‌లోని ఓ హోటల్‌, బర్మింగ్‌హామ్‌ తదితర ప్రాంతాల్లో నివాస గృహాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడి 2015లో యూకేలో పర్యటించిన సందర్భంగా దావూద్‌కు సంబంధించిన వివరాలతో కూడిన డోసియర్‌ను అప్పటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌కు అందజేశారు. సుమారు రెండేళ్ల తర్వాత ఈ చర్యలు తీసుకోవడంతో మోడి సర్కారుకు కీలక దౌత్య విజయం దక్కినట్లయింది. 
దావూద్‌ ప్రస్థానం
- దావూద్‌ 1970ల్లో ముంబయిలో సంఘటిత నేర సిండికేట్‌ను స్థాపించారు. 
- భారత్‌లో హత్య, అపహరణ, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదంతో పాటు ఇతర కేసుల్లో వాంఛిత వ్యక్తిగాఉన్నారు. 
- 1993 ముంబయి బాంబు పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
- 16 దేశాల్లో డి-కంపెనీ పేరిట పలు నేర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 
- అత్యంత వాంఛిత నేరగాడిగా ఇంటర్‌పోల్‌ జాబితాలో ఉన్నారు. 
- పాకిస్థాన్‌ కరాచీలోని క్లిఫ్టన్‌ ప్రాంతం నుంచి తన నేర సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నట్లు భారత నిఘా విభాగాలు భావిస్తున్నాయి. 
- కొంబియా మాదకద్రవ్యాల అధినేతగా పేరొందిన పాబ్లో ఎస్కోబార్‌ తర్వాత అత్యంత ధనవంతుడైన నేరగాడిగా పేరొందారు. 
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐఎస్‌, అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది. 
- యూకే ఖజానా విభాగం ఆర్థికఆంక్షల లక్ష్యాల జాబితాలో దావూద్‌ పేరును చేర్చింది. 
- ఐరోపా, ఆఫ్రికా, దక్షిణాసియాలోని పలు దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. విభిన్న దేశాల్లో 50కిపైగా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. 
- ఐక్యరాజ్యసమితి జాబితాలో దావూద్‌కు 15 మారు పేర్లను చేర్చారు. 

views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams