Current Affairs Telugu Daily

సింగపూర్‌ అధ్యక్షురాలిగా హాలిమా యాకోబ్‌ 
సింగపూర్‌ అధ్యక్ష పదవిని మొట్టమొదటిసారిగా ఓ మహిళ అలంకరించనున్నారు. ముస్లిం మలయ్‌ అల్పసంఖ్యాక వర్గానికి చెందిన హాలిమా యాకోబ్‌(63) దేశ అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. పార్లమెంటు మాజీ స్పీకర్‌ అయిన హాలిమా అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన వారు. గత రెండు దశాబ్దాలుగా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి వచ్చే నెలలో అధ్యక్షపదవికి ఓటింగ్‌ జరగాల్సి ఉంది. అయితే, ప్రత్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తిని అనర్హునిగా ప్రకటించటంతో హాలిమా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అయ్యింది. 
- కొన్ని దశాబ్దాలుగా ఏకపార్టీ పాలన కొనసాగుతున్న సింగపూర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను అనర్హులుగా ప్రకటించటం పరిపాటిగా మారింది. 
- అయితే, ఈసారి అధ్యక్ష పదవిని అల్పసంఖ్యాక ముస్లిం మలయ్‌ వర్గానికి ముందే రిజర్వు చేయటం, అనర్హత పేరుతో పోటీ నుంచి ప్రత్యర్థిని తప్పించటంతో విమర్శలు వస్తున్నాయి. 
- సింగపూర్‌లో అధ్యక్షునికి పరిమిత అధికారాలే ఉంటాయి. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఆ పదవిలో ఉండటం వల్ల ప్రభుత్వంతో ఘర్షణపడే సందర్భాలు చాలా అరుదు.

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams