Current Affairs Telugu Daily

వివేకానందుని చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం ప్రసంగానికి 125 ఏళ్లు
స్వామి వివేకానందుని చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం ప్రసంగానికి 125 ఏళ్లు, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా 2017 సెప్టెంబర్‌ 11 న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడి పాల్గొన్నారు. 125 ఏళ్ల క్రితం 9/11 (సెప్టెంబర్‌ 11)న చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుని ఉంటే.. 16 ఏళ్ల క్రితం అమెరికాలో 9/11 ఘటన (డబ్ల్యూటీసీ టవర్ల కూల్చి వేత తదితర ఉగ్ర విధ్వంసం) చోటు చేసుకునేది కాదని ప్రధాని నరేంద్ర మోడి పేర్కొ న్నారు. ఒకే తేదీన జరిగిన ఈ రెండు ఘటనలను పోలుస్తూ..  స్వామి వివేకానందుడి విశ్వ శాంతి సందేశాన్ని ప్రధాని గుర్తు చేశారు.
- 1893 సెప్టెంబర్‌ 11న స్వామి వివేకానంద చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ప్రసంగించారు
- వివేకానందుడి చికాగో ప్రసంగం ప్రారంభ వాక్యం : డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ అమెరికా

views: 904



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams