Current Affairs Telugu Daily

అన్నాడీఎంకే నుంచి శశికళ బహిష్కరణ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలిత నిచ్చెలి, ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ వీకే శశికళను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమెను అన్ని రకాల పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే శశికళ అక్క కుమారుడు, పార్టీ పగ్గాలు చేతుల్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన దినకరన్‌ను కూడా పార్టీ నుంచి, ఇతర పదవుల నుంచి తొలగించేశారు. పార్టీకి వారికి ఎలాంటి సంబంధం లేదని, వారు చేసిన నియామకాలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ తమ ప్రియతమ దివంగత నేత జయలిత పేరుమీదటే ఉంటుందని, పార్టీ గుర్తు అయిన రెండు ఆకులు కూడా తమ పార్టీకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే 11మంది ప్యానెల్‌ సభ్యులతో కొనసాగుతుండగా దీనికి డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం  నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 
AIADMK-All India Anna Dravida Munnetra Kazhagam 
- AIADMKను ఎం.జి.రామచంద్రన్‌ 1972లో స్థాపించారు
- జయలలిత 2016 డిసెంబర్‌ 5న మరణించారు

views: 988

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams