Current Affairs Telugu Daily

వినాయకుని ప్రకటనపై భారత్‌ కేసు 
మీట్‌ అండ్‌ లైవ్‌ స్టాక్‌ అనే ఆస్ట్రేలియా కంపెనీ ప్రకటనలో గణేషుడు నాన్‌వేజ్‌ తింటున్నట్లు చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కోర్టులో దీనిపై ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన అంశంగా కేసు వేసింది. ఈ ప్రకటన కారణంగా భారత ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ది మీట్‌ వుయ్‌ కెన్‌ ఆల్‌ ఈట్‌ పేరుతో ప్రకటన రూపొందించిన మీట్‌ అండ్‌ లైవ్‌స్టాక్‌ ఆస్ట్రేలియా కంపెనీకి ప్రకటనను వెనక్కి తీసుకోవాంటూ సిడ్నీలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ నోటీసు కూడా జారీ చేసింది. ఈ ప్రకటనలో వినాయకుడితో పాటు జీసస్‌, బుద్ధుడు, ఇతర గ్రీకు దేవతలు కూడా ఉన్నారు.
views: 1296

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams