Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌పై రూ.9.16 కోట్ల జరిమానా 
వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం వ్యాపార ప్రకటనదారులకు చేరకుండా పరిరక్షించడంలో విఫలమైనందుకు గాను ఫేస్‌బుక్‌పై స్పెయిన్‌ సమాచార పరిరక్షణ సంస్థ దాదాపు రూ.9.16 కోట్ల జరిమానా విధించింది. వినియోగదారుల భావజాలం, లింగం, మతపరమైన నమ్మకాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌ సేకరించిందని.. అయితే, వాటిని ఎందుకు సేకరించిందో మాత్రం స్పష్టంగా తెలియజేయలేదని స్పెయిన్‌ సంస్థ పేర్కొంది. వినియోగదారులు కోరినప్పటికీ.. వారి వివరాలను ఫేస్‌బుక్‌ తమ సమాచార నిధి నుంచి తొలగించలేదని సూచించింది. ఫేస్‌బుక్‌కు గతంలో ఫ్రాన్స్‌కు చెందిన డేటా ఏజెన్సీ కూడా తమ యూజర్ల డేటాను కాపాడటంలో విఫలమైందని 1,50,000 యూరోల జరిమానా విధించింది.
views: 922

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams