Current Affairs Telugu Daily

కవి సీతారాంకు కాళోజీ సాహిత్య పురస్కారం 
ఖమ్మం జిల్లాకు చెందిన రావులపాటి సీతారాంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక కాళొజీ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో సీతారాం మూడు దశాబ్దాలుగా కవిగా, విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలుగు అధ్యాపకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. 
- ఖమ్మం గ్రామీణ మండం ఆరెంపుకు చెందిన రావులపాటి నారాయణ, మాణిక్యం దంపతులకు 1964లో సీతారాం జన్మించారు. 
- 1985లో ‘రక్తస్పర్శ’ కవితా సంపుటితో ఆయన తన సృజనాత్మక రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. 
- 1990లో ‘ఇదిగో ఇక్కడి దాకే’ కవితా సంపుటి, 1995లో సన్నాఫ్‌ మాణ్యిం కవిత్వం, 2008లో కుప్పం కవితలు, 2010లో ‘అదే పుట’ సాహిత్య వ్యాస సంపుటితో పాటు పలు సాహిత్య వ్యాసాలు, ప్రముఖ కవులకు కవితా సంపుటాలకు ‘ముందు మాట’లు రాశారు. 
- 2011లో ‘కారేపల్లి కబుర్లు’ విద్యార్థుల రచనతో ప్రయోగాత్మకంగా సంకలనాన్ని వెలువరించారు. 
- 2014లో ‘మానుకోట ముచ్చట్లు’, 2009లో వరంగల్‌ యాసిడ్‌ దాడి నేపథ్యంలో ‘ఆ ముగ్గురు సరే-మన మాటేమిటి’ అనే సంఘటనాత్మక వ్యాస సంపుటిని వెలువరించారు. 
- ప్రస్తుతం మహబూబాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
కాళోజీ సాహిత్య పురస్కారం- నేపథ్యం
- ప్రజాకవి కాళక్షజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహిస్తోంది. భాష పరిరక్షణ కోసం పాటుపడుతున్న ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేస్తోంది
- 2015లో మొదటిసారిగా అమ్మంగి వేణుగోపాల్‌కు ఈ పురస్కారం ప్రదానం చేశారు
- 2016లో ప్రజాకవి గోరటి వెంకన్నకు ఈ అవార్డు లభించింది
- 2017లో సీతారాంను ఎంపిక చేశారు

views: 1245

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams