Current Affairs Telugu Daily

రోజుకి 4 గంటలు యాప్‌ల వినియోగం
భారత్‌లో మొబైల్‌ యూజర్స్‌ రోజుకు 4 గంటలు యాప్‌లతోనే గడుపుతున్నారని యాప్‌ అనలైటిక్స్‌ సంస్థ ‘యాప్‌ అన్నీ’ 9 దేశాల్లో జరిపిన సర్వేలో వెల్లడైంది. మొబైల్‌ యూజర్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌, సౌత్‌కొరియా, మెక్సికో, బ్రెజిల్‌, జపాన్‌, అమెరికా, యూకేలో అన్నీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ దేశాల్లో ఎక్కువగా, మధ్యస్థంగా, మాములుగా మొబైల్‌  ఉపయోగించే వారిని మూడు విభాగాలుగా విభజించి సర్వే నిర్వహించారు.  ఎక్కువగా ఉపయోగించేవారు రోజుకు 4 గంటలు యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.  మధ్యస్థంగా మొబైల్‌ వాడే వారు బ్రెజిల్‌లో రోజుకు 3 గంటలు, భారత్‌లో రెండున్నర గంటలు యాప్స్‌తోనే గడుపుతున్నారని తెలిపింది. ఇక మాములుగా మొబైల్‌ ఉపయోగించేవారు గరిష్టంగా యాప్‌ను గంటన్నర ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఎక్కువగా ఆండ్రాయిడ్‌ మెబైల్‌ యాప్స్‌నే ఉపయోగిస్తున్నట్లు అన్నీ సంస్థ ప్రకటించింది.
views: 1045



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams