Current Affairs Telugu Daily

9 మంది సైనికుకు సాహస పతకాలు
2016 సెప్టెంబరు 16న నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన 9 మంది సైనికులకు 2017 సెప్టెంబర్‌ 7న సాహస పతకాలను ప్రదానం చేశారు. ఉధంపూర్‌లోని ఉత్తర కమాండ్‌ ప్రధాన కార్యాయంలో జరిగిన కార్యక్రమంలో వీరితోసహా 108 మందికి ఈ పతకాలు లభించాయి. నాయిబ్‌ సుబేదార్‌ విపిన్‌ చంద్ర, హవల్దార్లు- రంకేష్‌ చంద్ర, షురు చకెన్‌, దలిప్‌ కుమార్‌, నాయక్‌- యోగేశ్‌ కుమార్‌, పారాట్రూపర్‌ ఇక్బాల్‌ సింగ్‌లు ఉగ్రవాద తండాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసాపత్రం పేర్కొంది. సైనికులు ఈ దాడిని విజయవంతంగా పూర్తి చేయడంలో పారాట్రూపర్‌ ఓంప్రకాశ్‌ కీలక సేవలందించారు. హవల్దార్‌ కె.అటి, పారా ట్రూపర్‌ దేవాష్‌ కుమార్‌లు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో ముఖ్య భూమిక తీసుకోవడమే కాకుండా ఒక్కొక్కరు ఒక్కో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ 9 మందికీ సైన్యం ఉత్తర విభాగ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డి.అన్బు పతకాలను ప్రదానం చేశారు.
నియంత్రణ రేఖ (Line of Control-LoC)  :
- నియంత్రణ రేఖ భారత పాకిస్తాన్‌ అధీనంలో ఉన్న కాశ్మీరు భూభాగాలను విడదీసే రేఖ. 
- నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తింపు పొందలేదు కానీ, ఇది సరిహద్దుగానే ఉంది. 
- మొదట సంధిరేఖగా పిలవబడిన ఈ రేఖను 1972 జూలై 3 నాటి సిమ్లా ఒడంబడిక తరువాత నియంత్రణ రేఖగా పిలుస్తున్నారు. 
- భారత్‌ అధీనంలో ఉన్న కాశ్మీరు సంస్థాన భాగం జమ్మూ కాశ్మీరు రాష్ట్రం కాగా, పాకిస్తాను అధీనంలో ఉన్న రెండు భాగాలను గిల్గిట్‌-బల్టిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీరు అని పిలుస్తారు. పాకిస్తాన్‌ దీన్ని ఆజాద్‌ కాశ్మీరు అని పిలుస్తుంది.
- నియంత్రణ రేఖ కాశ్మీరు లోని అనేక గ్రామాలను, కుటుంబాలను విడదీసింది

views: 1073

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams