Current Affairs Telugu Daily

గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో రూ.4900 కోట్ల నల్లధనం వెల్లడి
ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(PMGKY) కింద 21 వేల మంది ప్రజలు రూ.4900 కోట్ల నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించారని కేంద్రం తెలిపింది. వీరి నుంచి ఇప్పటివరకు రూ.2451 కోట్లను పన్ను రూపంలో వసూలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ పథకంలో పన్ను, జరిమానా రూపంలో అప్రకటిత ఆదాయంలో సుమారు 50% చెల్లించాల్సి ఉంటుంది. దీనికంటే ముందు 2016 జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉన్న ఆదాయ వెల్లడి పథకం(IDS)లో 71,726 మంది నుంచి రూ.67,382 కోట్ల ధనం వెలుగుచూసింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.12,700 కోట్ల పన్నును ప్రభుత్వం వసూలు చేసింది.
- ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం 2016 డిసెంబర్‌ 16 నుంచి 2017 మార్చి 31 వరకు అములో ఉంది 
PMGKY-Pradhan Mantri Garib Kalyan Yojana
IDS-Income Declaration Scheme

views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams