Current Affairs Telugu Daily

భారత్‌- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు
భారత్‌-శ్రీలంక దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు 2017 సెప్టెంబర్‌ 7న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. శ్రీలంక యుద్ధనౌకలు సాయురా, సాగర విశాఖ ఓడరేవుకు చేరుకున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య 5వ విడత సంయుక్త విన్యాసాలను రెండు విడతలుగా జరపనున్నారు. ఇందులో భాగంగా తొలివిడత విన్యాసాలు సెప్టెంబర్‌ 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండో విడత విన్యాసాలు 11 నుంచి 14వ తేదీ వరకు చేపట్టనున్నారు. విన్యాసాల్లో భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ ఘరియల్‌, ఐఎన్‌ఎస్‌ కోరాలు పాల్గొంటున్నాయి.
views: 900

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams